జ‌వాన్ల త్యాగాలు దేశం ఏనాటికీ మ‌ర్చిపోదు!

Sun,February 17, 2019 11:17 AM

KTR Pays Tributes To Pulwama Martyrs

హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఆర్‌పీఎఫ్ కార్యాలయంలో అమర జవాన్లకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కేటీఆర్ స్నేహితులు కూడా మరో రూ.25లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. రూ.50లక్షల చెక్కును సీఆర్‌పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు కేటీఆర్ అందజేశారు. పుల్వామా ఉగ్రదాడి ఎంతగానో కలచివేసిందని కేటీఆర్ అన్నారు. కేవలం జవాన్ల వల్లే మనమంతా క్షేమంగా ఉన్నామని పేర్కొన్నారు.

జ‌వాన్ల వ‌ల్ల‌నే దేశం సుర‌క్షితంగా ఉంటోంది. అమ‌రుల త్యాగాల‌ను దేశం ఏనాటికి మ‌ర్చిపోదు. వారి త్యాగాలు ఎప్ప‌టికీ త‌మ గుండెల్లో నిలిచిపోతాయి. ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాను. అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమం అనంతరం ఆయన స్థానిక సీఆర్పీఎఫ్ సిబ్బందితో మాట్లాడారు.


3868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles