బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణానికి శంకుస్థాపన

Mon,August 21, 2017 04:51 PM

ktr lays foundation stone to balanagar flyover


మేడ్చల్ : బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డితోపాటు ఎమ్మెలే వివేక్, ఇతర ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఫ్లైఓవర్‌తో లక్షలాది మంది ప్రజలకు ఊరట: కేటీఆర్
దశాబ్దాలుగా ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఊరట కలిగించేలా బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌ నిర్మిస్తున్నమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫ్లైఓవ‌ర్‌ ను ఇంకా పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. శంకు స్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే లాభమా..నష్టమా అనే చర్చ మూడున్నరేళ్ల క్రితం ఉండేది. ఆనాడు ఎన్నో అపోహలు.. అనుమానాలు..దుష్ప్రచారాలుండేవి. తెలంగాణ వస్తే ఆంధ్రావాళ్లను బతకనివ్వరని దుష్ప్రచారం చేశారన్నారు. మూడున్నరేళ్లలో ఒక్క సంఘటన కూడా జరగలేదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో రోడ్లు, ఫ్లైఓవ‌ర్‌ కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకా పదివేల కోట్ల ప్రతిపాదనలున్నాయి. త్వరలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోరైల్ ప్రారంభిస్తాం. మెట్రో రైల్ రెండో దశ గురించి ఆలోచిస్తున్నాం. స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖను భూములు అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. 2019లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే పట్టం కడతారని కాంగ్రెస్ నేతలందరికీ తెలుసునన్నారు.
bnagar-ktr2
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ద్వారా 4100 యూనిట్లకు అనుమతులు ఇచ్చిమన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా ఉందన్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే కరెంట్, నీళ్లకు గోస ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక ఆ రెండు సమస్యలు తొలగిపోయాయి. ఎండాకాలంలో సైతం కోతలు లేకుండా కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని, తెలంగాణ వచ్చినంక కరెంట్ గోస పోయిందని కేటీఆర్ తెలిపారు. గతంలో ఖాళీ బిందెలు, కుండలతో విపక్షాలు ప్రదర్శన చేసేవి. మనది ఇంకా కొత్త సంసారమే..ఎన్నో సమస్యలున్నాయన్నారు.

4092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles