యువతకు మార్గదర్శి కేటీఆర్: మంత్రి తలసాని

Wed,July 24, 2019 11:29 AM

KTR is idol to youth says minister talasani srinivas yadav

హైదరాబాద్: యువతకు మార్గదర్శి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రక్తదాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కేటీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. కేటీఆర్ యువతకు మార్గదర్శి అన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో యువతను కేటీఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలోనే విలక్షణమైన నాయకుడు కేటీఆర్ అన్నారు. ఐటీ మంత్రిగా హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచారన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ.. కేటీఆర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు.

786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles