రచన చదువు బాధ్యత తీసుకున్న కేటీఆర్‌

Thu,July 18, 2019 06:24 PM

KTR give aid for Rachana studies who got seat in CBIT

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ గ్రామానికి చెందిన రచన అనే యువతి ఇంజినీరింగ్‌ చదువు బాధ్యతను కేటీఆర్‌ తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన సీబీఐటీ కళాశాలలో విద్యనభ్యసించేందుకు సీటు వచ్చిన ఫీజు చెల్లించలేని ఆమె దీనస్థితిని వివరిస్తూ ఓ నెటిజన్‌ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. విషయాన్ని వ్యక్తిగతంగా చూస్తానని చెప్పిన కేటీఆర్‌ అన్నమాట ప్రకారం సదరు విద్యార్థిని పిలిపించుకుని కావాల్సిన సాయాన్ని అందజేశారు. రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంది. పాల్‌టెక్నిక్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లోని గండిపేట సీబీఐటీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో సీటు సాధించింది. ఫీజు చెల్లించలేని స్థితిలో ఆపన్నుల కోసం ఎదురు చూస్తుంది. విషయం తెలిసిన కేటీఆర్‌ తన పెద్ద మనసును మరోసారి చాటుతూ విద్యార్థిని చదువుకు కావాల్సిన ఆర్థికసాయాన్ని అందజేశారు. అదే విధంగా మేకల అంజలి అనే మరో యువతికి ఐఐటీ (ఇండోర్ )చదువు కోసం కావాల్సిన ఆర్థికసాయాన్ని కేటీఆర్ అందజేశారు.
1330
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles