ఎమ్మెల్సీలుగా గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులను అభినందించిన కేటీఆర్

Mon,June 3, 2019 11:09 AM

ktr congratulates newly elected mlcs

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మూడు సీట్లను గెలుచుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన చిన్నప రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. వాళ్ల గెలుపు కోసం శ్రమించిన జిల్లా నాయకత్వానికి, స్థానిక నాయకులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.


2626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles