ముస్లింలను ఓటు బ్యాంక్ గా ఎప్పుడూ చూడలేదు..

Thu,November 8, 2018 07:14 PM

ktr attends private teachers athmiya sammelanam in siricilla

సిరిసిల్ల: సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముస్లింలను ఓటు బ్యాంక్ గా ఎప్పుడూ చూడలేదని, పేదవారికి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కేజిలు ఇస్తున్నామని చెప్పారు. ముస్లిం పేదలకు ప్రతి పండుగకు బట్టలు ఇస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు చూశారు. మీకు ఎవరు ఎక్కువ బడ్జెట్ పెట్టారో చూడండి.

సిరిసిల్ల నియోజకవర్గంలో చాలా చోట్ల షాదీఖానాలు నిర్మించాం. ఒకప్పుడు హైదరాబాద్ లో పండుగలప్పుడు కర్య్పూ ఉండేది. కానీ మా ప్రభుత్వంలో ఎప్పుడు కర్య్పూ పెట్టలేదు. హిందూ, ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉన్నాం. సీఎం కేసీఆర్ మాత్రమే సెక్యులర్ వాధి అన్నారు.బీజేపీ నేత పరిపూర్ణనంద స్వామి 70 మంది గెలుస్తారని అంటున్నారు. ప్రస్తుతమున్న 5 పాత ఎమ్మెల్యే సీట్లలో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.. 4000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సిరిసిల్ల నియోజక వర్గంలో నిర్మాణంలో ఉన్నాయి. మీకు సొంతంగా జాగా ఉన్నట్లైతే ఇంటి కొరకు 5 లక్షల రూపాయలు ఇస్తం. బంగారు తెలంగాణ రాష్ట్రమే సీఎం కేసీఆర్ స్వప్నమని కేటీఆర్ అన్నారు.

1608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles