టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజలకు లాభం..

Mon,March 25, 2019 07:25 PM

KTR Attends karimnagar parliament constituency meeting


రాజన్న సిరిసిల్ల: బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం..కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ కు లాభం..టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడే సత్తా ఒక్క టీఆర్ఎస్ కే ఉందన్నారు.

సిరిసిల్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ..మమత, మాయావతి, అఖిలేశ్ యాదవ్.. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకమన్నారు. మోదీ వేడి తగ్గింది..కాంగ్రెస్ గాడి తప్పిందన్నారు. ఏ లెక్కన చూసినా మోదీకి 150 ఎంపీ సీట్లు, రాహుల్ కు వంద ఎంపీ సీట్లు దాటవన్నారు. టీఆర్ఎస్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే..ఢిల్లీలో 160 మంది జత కలుస్తరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles