జైనూర్ జెడ్పీటీసీగా కోవ లక్ష్మీ ఏకగ్రీవ ఎన్నిక

Thu,May 16, 2019 10:45 PM

Kova laxmi unanimously elected as jainur ZPTC in asifabad dist

జైనూర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ జెడ్పీటీసీగా కోవ లక్ష్మీ ఏకగ్రీవం కావడంపై సంబురాలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దత్తారాం.. జైనూర్ జెడ్పీటీసీ ఏకగ్రీవ ఎన్నిక పత్రాన్ని జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కోవ లక్ష్మీకి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం నుంచి ర్యాలీగా కోవ లక్ష్మీ నివాసానికి వెళ్లారు. అనంతరం కోవ లక్ష్మీ మాట్లాడుతూ.. జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles