ప్యాసింజర్ ఆటోలో నిరాడంబరంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం

Fri,November 16, 2018 08:44 PM

kothagudem candidate jalagam venkatrao files nomination simply by going on auto

ఇప్పటివరకు దాఖలైన నామినేషన్ల సంఖ్య 37
భధ్రాద్రి కొత్తగూడెం: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో స్వర్ణలతకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్యాసింజర్ ఆటోలో వెళ్లి జలగం నిరాడంబరంగా నామినేషన్ వేశారు. ఐదు రోజుల వ్యవధిలో మొత్తం జిల్లాలో నామినేషన్ల సంఖ్య 37కు చేరింది. కొత్తగూడెం నియోజకవర్గానికి ఐదవ రోజు ఏడు, అశ్వారావుపేట నియోజకవర్గానికి మూడు, భద్రాచలం నియోజకవర్గానికి రెండు, ఇల్లెందు నియోజకవర్గానికి రెండు, పినపాక నియోజకవర్గానికి ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ తెలిపారు.

2850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles