కొప్పులకు మొదటిసారి పట్టం..

Tue,February 19, 2019 12:09 PM

Koppula Eswar take Oath as Minister

పూర్తి పేరు : కొప్పుల ఈశ్వర్‌
పుట్టిన తేది : 1959, ఏప్రిల్‌ 20
తల్లిదండ్రులు : మల్లమ్మ, లింగయ్య
భార్య : స్నేహలత
కూతురు : నందిని, అల్లుడు అనిల్‌, మనుమడు భవానీ నిశ్చల్‌
విద్యార్హతలు : డిగ్రీ
స్వగ్రామం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం
చేపట్టిన శాఖ : సంక్షేమశాఖ


హైదరాబాద్ : టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ధర్మపురి ఎమ్మె ల్యే కొప్పుల ఈశ్వర్ తొలిసారిగా సంక్షేమశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సింగరేణి ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు కొప్పుల ఈశ్వర్. సింగరేణి సంస్థలో 20ఏళ్ల పాటు ఉద్యోగిగా పని చేశారు. 1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్ రాష్ర్ట మిడ్ క్యాప్ సంస్థ డైరెక్టర్ గా.. మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ గా.. మేడారం నియోజకవర్గం దేశం పార్టీ ఇంచార్జీగా పని చేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీలో నమ్మకంగా ఉంటూ, అకింతభావంతో పనిచేస్తూ వచ్చారు. సందర్భం ఏదైనా కేసీఆర్ వెంట నడిచారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి 2018 వరకు జరిగిన ఉపఎన్నికలు, సాధారణ ఎన్నికలతో కలుపుకుని వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రాష్ట్రంలో ఇంత వరకు డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉండగా, ఆ తర్వాత ఈటల రాజేందర్, హరీశ్‌రావుతోపాటు కొప్పుల సొంతం చేసుకున్నారు. పలుసార్లు అమాత్య పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. కొత్త రాష్ట్రంలో మొదటిసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా, చివరి క్షణంలో చేజారి పోయింది. తర్వాత చీఫ్ విప్ హోదా వరించింది. అయినా ఏనాడూ నిరాశ చెందకుండా అధినేత వెంటే నడిచారు. విధేయతతో పనిచేస్తూ, నమ్మకమైన నాయకుడిగా ఉన్నారు. తాజాగా ఆ విధేయత, అంకితభావానికి సీఎం కేసీఆర్ పట్టం కట్టారు. కొప్పులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కొప్పుల ఈశ్వర్ వ్యవహరించిన విషయం తెలిసిందే.

2633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles