కొండగట్టు బాధితులకు పరిహారం మంజూరు

Wed,October 17, 2018 09:07 AM

kondagattu Road Accident Victims to get Compensation

జగిత్యాల: కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేయనున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరిన విష‌యం తెలిసిందే. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయడానికి ఎన్నికల కోడ్ నిబంధనలు వర్తింపుపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 62 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడిన విష‌యం తెలిసిందే.

3920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles