అంజన్న హుండీ ఆదాయం రూ.65.66 లక్షలు

Mon,September 16, 2019 09:03 PM

జగిత్యాల : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల హుండీలను విప్పి లెక్కించగా రూ. 65 లక్షల 66వేల 713 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. 59రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల్లో నగదు రూపంలో రూ.65లక్షల 66వేల 713, మిశ్రమ బంగారం రూపంలో 20గ్రాములు, మిశ్రమ వెండి 2కిలోల 800 గ్రాములు, 51విదేశీ కరెన్సీ నోట్లు ఆంజనేయ స్వామి వారికి ఆదాయం కూపంలో సమకూరినట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జగిత్యాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ రవికిషన్, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు అంజయ్య, శ్రీనివాస్ శర్మ, ఆలయ సిబ్బంది, కాసర్ల శ్రీనివాస్, బండ లకా్ష్మరెడ్డి, సునిల్, సంపత్, లక్ష్మీరాజం, రాజేశ్వర్ రావు, ధర్మేందర్, శివశక్తి సేవా సమితి ఇన్‌ఛార్జిలు సతీష్, పండుల ఆధ్వర్యంలో 213మంది స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

1434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles