కొన్ని క్షణాల్లోనే సంబురాలు ఆవిరయ్యాయి..

Fri,May 24, 2019 07:23 AM

konda vishweshwar reddy defeated in last minute from chevella


రంగారెడ్డి: కాంగ్రెస్‌ నాయకుల విజయోత్సవ సంబురాలు కొన్నిక్షణాల్లో ఆవిరైయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిందంటూ కౌంటింగ్‌ పూర్తికాకముందే కొంతమంది అవగాహన లేకుండా సోషల్‌మీడియాలో పోస్టులు చేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుస్తుగా సంబురాలు చేసుకున్నారు. ఇందుకు తోడు పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం మీడియా ముందుకు వచ్చి తాను లక్షమెజార్టీతో విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తంచేస్తూ ప్రకటించారు. దీంతో రాజేంద్రనగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నాయకులు సంబురాలను చేసుకున్నారు. కానీ ఆ సంబురాలు కొన్ని క్షణాలకే ఆవిరైయ్యా యి. ఓ వైపు ఓట్ల లెక్కింపులు జరుగుతుండగానే రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్‌, మహేశ్వరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు శేరిలింగంపల్లి ప్రాంత ఓట్ల లెక్కింపులో అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ గ్రామీణ ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిస్తున్నట్లు ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఏకంగా కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 11వేల పైచీలుకు మెజార్టీ కాస్త 217కు పడిపోయింది. ఇది చూసిన కాంగ్రెస్‌ నాయకులు ఒక్కసారిగా డీలా పడ్డారు. పెరిగినట్లే పెరిగిన మెజార్టీ ఏకంగా తగ్గడం ప్రారంభమైయింది. దీంతో కాంగ్రెసోళ్ల ఉత్సాహం క్రమేణా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెజార్టీ పెరుగుతుండటంతో తగ్గిపోయింది. చేసేదేమీ లేక సంబురాలు ఆపి నిరుత్సాహానికి గురైయ్యారు.

గ్రామీణ ఓటర్ల తీర్పు గులాబీ పక్షం..


రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు గులాబీపార్టీ వైపు తమ మద్దతును ఓటుద్వారా చాటిచెప్పారు. అభివృద్ధి అంకితభావంతో పనిచేస్తున్న సర్కారుకే తమ ఓటు అంటూ ఈవీఎంలో భద్రపర్చారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్‌, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు శేరిలింగంపల్లి ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపినట్లు ఫలితాల సరళినిబట్టి వెల్లడైయింది. దీంతో గులాబీ శ్రేణుల్లో అమితమైన ఉత్సాహం రెట్టింపుతో సంబరాల్లో మునిగితేలారు. ఇక కొన్ని మీడియా సంస్థలలైతే ఏకంగా చేవెళ్లలో కాంగ్రెస్‌ విజయం ఖరారైనట్లు స్క్రోలింగులు ప్రకటించడంపై ప్రజలు విస్మయం వ్యక్తపర్చారు.

16918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles