‘అధికారికంగా కొండా లక్ష్మణ్ జయంతి నిర్వహణ’

Sat,September 26, 2015 12:38 PM

Konda Lakshman Jayanti will do officially

హైదరాబాద్: అలుపెరగని పోరాటయోధుడు, ఉద్యమజీవి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రేపు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ విముక్తికి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు కొండా లక్ష్మణ్ అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భారత స్వాతంత్య్ర సమరంలో అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్‌బాపూజీ. 1915 సెప్టెంబర్ 27న జన్మించిన బాపూజీ 21 సెస్టెంబర్, 2012న పరమపదించారు.

1431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles