కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వం రద్దు

Tue,March 13, 2018 10:15 AM

Komatireddy Venkatreddy and Sampath Kumar assembly membership cancelled by speaker

హైదరాబాద్ : నిన్న శాసనసభలో జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. మిగతా కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మండలి నుంచి కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్
శానసమండలి నుంచి ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ప్రకటించారు. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు.

11109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles