కోమటి చెరువుపై ‘జిప్ సైక్లింగ్’

Tue,May 28, 2019 11:58 AM

Komaticheruvu gets zip cycling facility

సిద్దిపేట అర్బన్ : రాష్ర్టానికే రోల్ మోడల్ అయిన సిద్దిపేట కోమటి చెరువుపై ప్రజలకోసం పర్యాటక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో కోమటి చెరువుపై జిప్ సైక్లింగ్ ఏర్పాటు అయింది. పనులు పూర్తి కావడంతో ఈ రోజు ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఏ పర్యాటక కేంద్రం అయినా... ఎక్కడైనా సైక్లింగ్ అంటే కింద మాత్రమే ఉంటాయి. ఇందుకు భిన్నంగా సిద్దిపేట కోమటి చెరువుపై జిప్ సైక్లింగ్ తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కోమటిచెరువుపై ఏర్పాటు చేశారు. సైక్లింగ్ చేసే వారికి, పిల్లలకు మరింత పర్యాటక నెలవుగా మారనుంది. చెరువుపై సైక్లింగ్ ఏర్పాటుతో ఒకవైపు ఆహ్లాదం... మరోవైపు ఆరోగ్యం కూడా ఉంటుంది. సాయంత్రం కోమటిచెరువుపై జిప్ సైక్లింగ్‌ను ప్రారంభిస్తారు. దీంతో అందుబాటులోకి రానుంది.

సైక్లింగ్‌తో ఉత్సాహం...


చెరువుపై సైక్లింగ్ అంటే సాహసం.. ఒక ఉత్సాహం కూడా ఈ జిప్ సైక్లింగ్‌తో పర్యాటకులకు ఒక సాహసోపేతాన్ని ఇవ్వనుంది. సాహస క్రీడలు అంటే ఆసక్తి కల వారు ఈ సైక్లింగ్ ఏర్పాటుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోమటి చెరువు గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందగా ఈ సైక్లింగ్ తో మరింత పర్యాటక ంగా అబివృద్ది చెందింది.

1070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles