కోయిల్ సాగర్, కల్వకుర్తి అదనపు ఆయకట్టుకు అనుమతిFri,January 12, 2018 11:10 PM
కోయిల్ సాగర్, కల్వకుర్తి అదనపు ఆయకట్టుకు అనుమతి

మహబూబ్‌నగర్: కోయిల్ సాగర్ ఎత్తిపోతల ఎడమ కాల్వ కింద అదనపు ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 8014 ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీరందించే పనులకు అనుమతి లభించింది. అందుకు అనుగుణంగా రూ. 33.70 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులను నీటి పారుదల శాఖ జారీ చేసింది.

ఇక.. కల్వకుర్తి ఎత్తిపోతల కింద అదనపు ఆయకట్టుకు నీరందించేందుకు అనుమతి వచ్చింది. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండెం, మొలచింతపల్లి గ్రామాల్లోకి 1400 ఎకరాలకు అదనంగా నీరిచ్చేలా పనులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. రూ. 19.10 కోట్ల విలువైన పరిపాలనా అనుమతులను నీటి పారుదల శాఖ ఈ సందర్భంగా జారీ చేసింది.

520
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS