శాంతి భద్రతల దృష్ట్యానే రేవంత్ రెడ్డి అరెస్ట్

Tue,December 4, 2018 12:51 PM

kodangal police responds on Revanth reddy arrest

కొడంగల్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యానే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ కోస్గిలో జరిగే టీ ఆర్ ఎస్ బహిరంగ సభను అడ్డుకుంటామని ఈ నెల 2వ తేదీన రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొండగల్ బంద్ కూడా పిలుపునిచ్చారు. ర్యాలీలు నిర్వహించి సభను అడ్డుకోవాలని తమ అనుచరులను రేవంత్ ప్రేరేపించారని.. ఈ క్రమంలోనే శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందనే 144 సెక్షన్ విధించడం జరిగిందని పోలీసులు తెలిపారు. టీ ఆర్ ఎస్ సభకు న్యాయపరమైన అనుమతి తీసుకున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం సరికాదు. అడ్డుకోవడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే సమస్య ఉండటంతోనే ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు రేవంత్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. రేవంత్ రెడ్డి కొద్ది గంటలు మాత్రమే పోలీసుల అదుపులో ఉంటారని.. ఆర్ ఓ ఫిర్యాదు మేరకే రేవంత్ రెడ్డిని అరెస్టు చేసామని వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. ఆయనకేమీ ఇబ్బంది లేదని, మహబూబ్‌నగర్‌లోనే క్షేమంగా ఉన్నారని ఎస్పీ విలేకరులతో చెప్పారు.

5079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles