కేసీఆర్‌కే మా ఓటు అంటున్న కొడంగల్ రైతులు.. వీడియో

Fri,October 12, 2018 12:58 PM

Kodangal Farmers says thanks to CM KCR

రైతుల పాలిట దేవుడు.. అన్నదాతకు అండగా నిలబడుతున్న ఆపద్భాందవుడు.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసి రైతులకు ఆర్థికంగా భరోసానిస్తున్న కేసీఆర్‌కు కొండగల్‌కు చెందిన ఇద్దరు యువ రైతులు వినూత్నంగా కృతజ్ఞతలు చెప్పారు. కేసీఆర్‌కే తాము ఓటేస్తామని ఆ ఇద్దరు రైతులు చెబుతున్నారు.

కొడంగల్ నియోజకవర్గం గుండేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతు సోదరులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినూత్న తరహాలో కృతజ్ఞతలు తెలిపారు. కేశవరెడ్డి, గోపాల్‌రెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారు బొమ్మను ట్రాక్టర్‌తో గీశారు. ఈ భారీ కారు గుర్తు వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. రైతుబంధు, రైతుబీమా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు వంటి రైతు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రైతు సోదరులు ఆకాంక్షించారు. కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


యువ రైతులకు కేటీఆర్ థ్యాంక్స్
ఈ వీడియోను వీక్షించిన మంత్రి కేటీఆర్.. యువ రైతులైన కేశవ రెడ్డి, గోపాల్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. వీడియో అద్భుతంగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు.
2819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles