19న కిడ్స్ అండ్ కార్ఫ్స్

Mon,August 14, 2017 05:05 AM

Kids and Corps august 19th 2017

హైదరాబాద్ : అర్బన్ పోలీసింగ్‌లో భాగంగా ఈనెల 19వ తేదీన కిడ్స్ అండ్ కార్ఫ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ డీసీసీ బడుగుల సుమతి తెలిపారు. డీసీసీ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడుతూ సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో శనివారం నిర్వహించనున్న కార్యక్రమంలో 8 ప్రభుత్వ పాఠశాలలు, 8 కార్పొరేట్‌కు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిపి ఐదు టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిటీలో శాంతిభద్రతలు, పాలన వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందోనన్న అంశంపై విద్యార్థులతో నివేదిక రూపొందించేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles