కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకి లభ్యం

Thu,September 20, 2018 02:21 PM

kidnapped boy identified at hyderabad bahadurpura

రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్‌లో నిన్న బాలుడు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. బాలుడు కౌశిక్‌ను దుండగులు హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో వదిలివెళ్లారు. బాలుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల సమాచారం కోసం బాలుడిని విచారిస్తున్నారు. దుండగులు 7661915822 నెంబర్ నుంచి కౌశిక్ తండ్రి వెంకటేశ్వర్‌గౌడ్‌కు ఫోన్ చేసి నీ కొడుకును కిడ్నాప్ చేశామని తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న అలీమ్ మహ్మద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles