చిన్నారి చేతన

Thu,July 5, 2018 12:45 PM

kidnapped baby named after ACP Chetana

హైదరాబాద్: కోఠి ప్రసూతి ఆస్పత్రి నుంచి మాయమైన చిన్నారి .. మూడు రోజుల తర్వాత మళ్లీ తల్లి ఒడికి చేరుకున్నది. పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకుని, ఆ బిడ్డను మళ్లీ తల్లి విజయ ఒడికి చేర్చిన ఘనత మాత్రం సుల్తాన్ బజార్ ఏసీపీ చేతనకు దక్కుతుంది. బిడ్డ దొరికిందన్న శుభసందర్భంలో ఆ పాపకు బుధవారం నామకరణం కూడా చేశారు. శిశువును తల్లి వద్దకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ పాపకు పెట్టారు. అయితే పాపకు తన పేరు పెట్టడం పట్ల ఏసీపీ చేతన స్పందిస్తూ సంతోషానికి గురయ్యారు. తన పేరును పాపకు పెట్టడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
చిన్నారి శిశువు కామెర్లు, ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన విజయ, నరేశ్ దంపతులు .. ఆడ బిడ్డ పుట్టాలని ఎన్నో ఏళ్లుగా పూజలు చేశారు. తన సోదరుడికి ఇద్దరు కుమారులు అని, తనకు కూడా మొదట కొడుకే పుట్టాడని, ఆడ బిడ్డ పుట్టాలని రాష్ట్రంలో అన్ని గుళ్లకు వెళ్లామని, తిరుపతి శ్రీవారిని కూడా కూతురు కావాలని ప్రార్థించామని నరేశ్ తెలిపాడు. ఏడేళ్ల తర్వాత జూన్ 27వ తేదీన తనకు కూతురు పుట్టినట్లు అతను తెలిపాడు. బిడ్డ పుట్టిందని తెలియగానే హాస్పటల్‌లో స్వీట్లు పంచినట్లు కుటుంబ సభ్యుడు ఒకరు గుర్తు చేశారు.


1652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS