కేజీబీవీ టీచర్ల బదిలీలకు షెడ్యూల్ జారీ

Tue,October 22, 2019 07:56 AM


హైదరాబాద్ : రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులను స్వీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం జారీచేసింది. ఈ నెల 23 నుంచి 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, సంబంధిత మార్గదర్శకాలు తదితర వివరాల కోసం www.samagrashiksha.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. కేజీబీవీలలో పనిచేస్తున్న ఎస్వో, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ, ఏఎన్‌ఎం బదిలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపారు. కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్ విడుదల చేయడం పట్ల ఆ ఉపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు సీహెచ్ రవి హర్షాన్ని వెలిబుచ్చారు.

477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles