ఆధార్‌కార్డు చూపిస్తే కిలో ఉల్లి..

Thu,December 5, 2019 07:45 AM


హైదరాబాద్ : ఇటీవల నగరంలోని రైతుబజారుల్లో ప్రారంభించిన సబ్సిడీ ఉల్లి కేంద్రాలకు భారీ స్పందన లభిస్తోంది. సామాన్యులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో అందరికీ అందేలా ఆధార్‌ కార్డును నమోదు చేసుకుని రూ.40కి కిలో చొప్పున రోజుకు వెయ్యి కిలోలు విక్రయిస్తున్నారు. అయితే ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు విక్రయ కేంద్రాలు పని చేస్తున్నాయి.


వనస్థలిపురం రైతుబజార్‌లో ప్రారంభించిన సబ్సిడీ ఉల్లి కేంద్రానికి భారీ స్పందన లభిస్తోంది. వనస్థలిపురంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఉల్లి కొనుగోలుకు ఇక్కడికి వస్తున్నారు. దీంతో రోజుకు సగటున పది క్వింటాళ్ల వరకు విక్రయిస్తున్నట్లు రైతు బజార్‌ సిబ్బంది తెలిపారు. మార్కెట్‌లో భారీగా పెరిగిన ఉల్లి ధరకు కళ్లెం వేయడంతోపాటు, సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా ప్రభుత్వం సబ్సిడీ కేంద్రా లను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.బహిరంగ మార్కెట్‌లో ఉల్లిగడ్డ రూ.80నుంచి 100కు అమ్ముతున్నారు. సబ్సిడీపై రైతుబజార్‌లో రూ.40కి కిలో చొప్పున అందిస్తున్నారు.

ప్రతి రోజూ సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు విక్రయ కేంద్రం పనిచేస్తుంది. కేంద్రాన్ని ప్రారంభించి ఐదురోజులు అవుతుండగా ఇప్పటికే 50 క్వింటాళ్లు ఉల్లిని సరఫరా చేశారు. కుటుంబానికి ఒక్క కిలో చొప్పున తీసుకోవాలని వ్యాపారస్తులకు విక్రయించేది లేదని తెలిపారు. కాగా ధరలు పెరిగినపుడు ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles