ఏసీబీ కస్టడీకి తహసీల్దార్‌ లావణ్య

Thu,July 18, 2019 04:44 PM

keshampet tahsildar lavanya is going to be in ACB custody

హైదరాబాద్‌: ఏసీబీ ప్రత్యేక కోర్టు కేశంపేట తహసీల్దార్‌ లావణ్యను కస్టడీకి అనుమతించింది. ప్రత్యేక కోర్టు తహసీల్దార్‌ లావణ్యను రెండ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అధికారులు లావణ్యను విచారించనున్నారు. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఏసీబీ అధికారులు లావణ్యను రేపు కస్టడీకి తీసుకోనున్నారు. వీఆర్‌వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్‌ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఏకంగా రూ.93 లక్షల అక్రమ నగదును పట్టుకున్న విషయం తెలిసిందే.

1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles