డిసెంబర్ 7న కేసీఆర్‌దే విజయం: ఎంపీ బూర

Sun,October 7, 2018 01:41 PM

KCR Will  win  upcoming elections in Telangana?

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు విచిత్రంగా ఉన్నాయని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఎన్నికలు ఆలస్యం కావాలని కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మర్రి శశిధర్‌రెడ్డి అంతర్జాతీయ కోర్టుకు పోతారేమోనని ఎద్దేవా చేశారు. టికెట్ల ప్రకటన తర్వాత మహాకూటమి విచ్ఛిన్నం అవుతుంది. హంద్రీనీవాకు హారతులు పట్టిన నేతలా కేసీఆర్‌ను విమర్శించేదని మండిపడ్డారు. సిద్ధాంత సారూప్యత లేని కూటమి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రాన్ని వదిలి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కేసీఆర్ గెలుపును మహాకూటమి నేతలు అడ్డుకోలేరు. డిసెంబర్ 7న అమావాస్య అయినా కేసీఆర్‌దే విజయం అని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత డీకే అరుణకు లేదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎన్నికలంటేనే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయం అని అన్నారు

2849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles