మళ్లీ కేసీఆరే రావాలంటున్నారు : సీఎం కేసీఆర్

Sun,September 2, 2018 07:38 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు చెబుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. శాసనసభ రద్దుపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఇలాంటి వార్తలు రాయడం సరికాదు. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే నిజమైన వికాసం అని సీఎం పేర్కొన్నారు. దృక్పథం మారితే పనిచేసే పంథా మారితే అభివృద్ధి దానికదే సాధ్యమవుతుందన్నారు. 2018-19లో ఆర్థిక ప్రగతి 17.83 శాతంగా ఉందన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 9.60 కోట్లు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 1,980 కోట్లు అని తెలిపారు. నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. పెన్షన్లు పెంచుకుందామని పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఒప్పించి కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించుకున్నాం. టీఆర్‌ఎస్సే లేకపోతే.. కేసీఆరే సీఎం కాకపోతే స్థానికులకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ దక్కేదా? అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు కే కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వేస్తామన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇంకేం పథకాలు ప్రవేశపెడ్తామో చెప్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

4133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles