కాల్వ చివరి భూములు అనే మాట వినిపించడానికి వీల్లేదు!

Fri,November 30, 2018 06:06 PM

KCR speech at Praja Ashirvada Sabha in peddapally

పెద్దపల్లి: నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. ఓటు ప్రాధాన్యత గుర్తించి ప్రజా ఎజెండా వైపు అడుగులు వేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రసంగిస్తూ.. 58ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఒక వైపు..14ఏండ్లు పోరాడి నాలుగేండ్లు పాలించిన టీఆర్‌ఎస్ ఒక వైపు ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ మీ కళ్ళముందే ఉన్నాయి. సమైక్య పాలనలో జీవన విధ్వంసం జరిగింది. కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే లేదు. బీజేపీ ఉన్న 19 రాష్ర్టాల్లో రైతుబంధు, కల్యాణ లక్ష్మి ఇస్తున్నారా అని మోదీని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పెద్దపల్లిలో కాల్వలకు సరిగా నీళ్ళురావు. కాళేశ్వరంతో త్వరలోనే పుష్కలంగా నీళ్ళు వస్తాయి. కాల్వ చివరి భూములు అనే మాట వినిపించడానికి వీల్లేదు. ప్రతీ ఎకరానికి నీళ్ళ వస్తాయి. మంచివాళ్ళు గెలిస్తే అంతా మంచే జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. దాసరి మనోహర్‌రెడ్డి ఎంత మంచి వ్యక్తో మీకు తెలుసు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

1685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles