"కేసీఆర్ మళ్ళీ సీఎం కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది"

Fri,October 12, 2018 03:44 PM

KCR should again Telangana cm says kadiyam srihari

మహబూబాబాద్: తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా ఎవరు ఊహించని పథకాలు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అటువంటి కేసీఆర్ మళ్లీ తెలంగాణకు సీఎం కావాల్సిన చారిత్రక అవసరం ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజక వర్గ పార్టీ సమన్వయ సమావేశంలో కడియం శ్రీమరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో అందరి ప్రశంసలు పొందాయన్నారు. కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్లు ఇలాంటి ఎన్నో పథకాలు ఏనాడైనా ఊహించామా.? మళ్ళీ టి.ఆర్.ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ 17.7 శాతం అభివృద్ది రేటుతో ముందంజలో ఉందన్నారు. ఇది సీఎం గా కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమైందని తెలిపారు.

డోర్నకల్ లో టి.ఆర్.ఎస్ పార్టీ సత్యవతి రాథోడ్ రాకతో గోదావరిలో ప్రాణహిత వచ్చి చేరినట్లు, రెడ్యానాయక్ రాకతో ఇంద్రవతి కలిసినట్లుగా ఉగ్ర గోదావరి నదిని తలపిస్తుందన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నియోజక వర్గ సమన్వయ కమిటీ, మండల సమన్వయ కమిటీలు వేసుకున్నాం. ఈ కమిటీలు ఎన్నికలలో, ఎన్నికల తర్వాత కూడా పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో కూడా చురుకుగా పని చేస్తాయి. పార్టీ అభ్యర్థిగా రెడ్యా నాయక్ అన్ని వర్గాలను కలుపుకొని పోయి, సమన్వయం చేసుకొని భారీ మెజారిటీ సాధించాలి. భవిష్యత్ లో కూడా అందరికి అవకాశాలు కల్పించాలి. స్థానిక ఎంపీ సీతారాం నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ పరిశీలకులు, ఐఐసి చైర్మన్, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

1863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles