కేసీఆర్ కిట్-అమ్మ ఒడి కార్యక్రమానికి కసరత్తుSat,May 20, 2017 07:08 AM

KCR kit Amma vadi works going on

హైదరాబాద్: బాలింతలు, నవజాత శిశువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కేసీఆర్ కిట్- అమ్మఒడి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. జూన్ 2న ప్రారంభించనున్న ఈ కార్యక్రమం కోసం జిల్లాల వారీగా గర్భిణుల సమాచారం, ఇతర వివరాలను అధికారులు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆర్థిక సాయాన్ని ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గర్భిణుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. కాగా కేసీఆర్ కిట్-అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్మన్‌గా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కన్వీనర్‌గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ వ్యవహరిస్తారు. సభ్యులుగా మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, కేసీఆర్ కిట్- అమ్మఒడి ప్రత్యేకాధికారి, ఎంహెచ్‌ఎన్ జాయింట్ డైరెక్టర్, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్, ఐటీశాఖ, యూనిసెఫ్ ప్రతినిధి, ఫెర్నాండెజ్ దవాఖానల స్థాపకుడు ఎవిట ఫెర్నాండెజ్‌ను నిర్ణయించారు. జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్, డీఎంహెచ్‌వో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా దవాఖాన, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్లు, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ, ఎంసీహెచ్, సీహెచ్‌ఐ కార్యక్రమ అధికారులు ఉండాలని నిర్ణయించారు.

3 లక్షల ప్రసవాలు అంచనా
2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. ఆర్థిక సాయం అందించేందుకు రూ.375 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కేసీఆర్ కిట్ల పంపిణీ కోసం ఒక్కో నవజాత శిశువుకు రూ.2 వేల చొప్పున రూ.60 కోట్లు, కార్యక్రమంపై ప్రచారం, ఇతర నిర్వహణ ఖర్చులు రూ.8.62కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం ప్రభుత్వం ముందస్తుగా రూ.150 కోట్లను మంజూరు చేసింది.

1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS