జర్నలిస్టు జెస్సీ కుటుంబానికి రూ.4 ల‌క్ష‌ల సాయంFri,February 17, 2017 03:39 PM
జర్నలిస్టు జెస్సీ కుటుంబానికి రూ.4 ల‌క్ష‌ల సాయం

హైద‌రాబాద్: స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్టు జే. శ్రీ‌నివాసులు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ నాలుగు ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన జ‌ర్న‌లిస్టులతో జనహిత కార్య‌క్ర‌మంలో ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. నాలుగు ల‌క్ష‌ల చెక్‌ను జెస్సీ స‌తీమ‌ణి అన్న‌పూర్ణకు సీఎం అంద‌జేశారు. జే.శ్రీనివాసులు దాదాపు 30 ఏళ్లుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేశారు. ఇటీవలే ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. రాష్ట్ర జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్థిక సాయం చేయ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ముందు ఉన్న‌ద‌ని ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో చ‌నిపోయిన 69 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ఇవాళ చెక్‌ల‌ను అంద‌జేశారు. ప్ర‌తి ఒక చ‌నిపోయిన జ‌ర్న‌లిస్టు కుటుంబానికి ల‌క్ష రూపాయల చొప్పున చెక్కుల‌ను అంద‌జేశారు.

1873
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS