కేసీఆర్‌, కేటీఆర్‌ అండగా ఉన్నారు : తాటికొండ రాజయ్య

Tue,September 10, 2019 03:21 PM

KCR and KTR always supported me says MLA Rajaiah

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తనకు అండగా ఉండడం వల్లే గత ఎన్నికల్లో తాను గెలిచానని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 'నేను నాలుగోసారి గెలవడానికి కేసీఆర్‌, కేటీఆర్‌ కారణం. నా జీవితాంతం టీఆర్‌ఎస్‌లోనే ఉంటాను. గత ఎన్నికల్లో నా గెలుపులో కేటీఆర్‌ పాత్ర ఎంతో ఉంది. నా జీవితాంతం వారు ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ న్యాయం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. తెలంగాణ నేతగా ఎదిగేందుకు నాకు సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో 58 వేల మెజార్టీతో గెలిచాను. ఎంతో మంది సీనియర్‌ నేతలున్నా సీఎంను ప్రతిపాదించే అవకాశం నాకు కల్పించారు. డిప్యూటీ సీఎం పదవి పోయినా.. ప్రభుత్వంలో అనేక రకాలుగా నన్ను ప్రోత్సహించారు. సీఎంగా కేసీఆర్‌ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కేసీఆర్‌ నన్ను ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దారు. రాజకీయంగా కేసీఆర్‌ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు' అని రాజయ్య స్పష్టం చేశారు.

3767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles