ఎల్లలు దాటి వెలుగొందుతున్న భాష.. తెలుగు

Sun,December 17, 2017 02:18 PM

హైదరాబాద్ : తెలుగు అంటే జిల్లాలు, రాష్ర్టాల భాష కాదు.. ఎల్లలు దాటి వెలుగొందుతున్న భాష అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా నిర్వహించిన బృహత్ కవి సమ్మేళనంలో కర్నె ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మాండలికంలో కవిత్వాలు అద్భుతంగా వచ్చాయన్నారు. మన తెలంగాణ భాష గత పాలకుల నిర్లక్ష్యంతో బందీ అయి ఉండిపోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణ మాండలికానికి సినీరంగంలో అత్యధిక ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ భాష, యాస, మాండలికానికి పట్టం కట్టడానికి హైదరాబాద్ మహానగరం వేదికై నిలిచిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఉద్యమ ప్రాధాన్యతను వివరించి తెలంగాణ సాధనలో అందరినీ భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.

1476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles