22న కర్ణాటక క్యాబినెట్ విస్తరణ

Thu,December 6, 2018 10:46 PM

karnataka cabinet expansion on 22nd december 2018

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ నెల 22న తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. సంకీర్ణ సర్కార్‌ను నడుపుతున్న కుమారస్వామి ఈసారి కాంగ్రెస్ నుంచి ఆరుగురిని, తన జేడీ(ఎస్)కు చెందిన ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతుండటంతో ఆశావహుల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న బీజేపీ నేతలు త్వరలోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో క్యాబినెట్ విస్తరణపై సస్పెన్స్‌కు తెరవేసిన కుమారస్వామి తాజాగా తేదీని కూడా ప్రకటించారు. అంతకుముందు మాజీ సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించింది. ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జేడీఎస్ అధినాయకుడు హెచ్‌డీ దేవెగౌడను సంప్రదించి మంత్రివర్గ విస్తరణ తేదీని ఖరారు చేసినట్టు తెలిసింది.

1042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles