కరీంనగర్ - తిరుపతి రైలు వారానికి నాలుగుసార్లు

Sun,December 16, 2018 06:57 AM

Karimnagar-Tirupati train four times in a week

హైదరాబాద్: కరీంనగర్- తిరుపతి రైలును ఇకపై వారానికి నాలుగుసార్లు నడిపేందుకు రైల్వేశాఖ అంగీకరించిందని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఎంపీ దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌గుప్తాను కలిసి కరీంగనర్- తిరుపతి రైళ్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో గల లెవల్ క్రాసింగ్ వద్ద రూ.102 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సైతం రైల్వే బోర్డు అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలు మార్గంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 2019 మార్చి 21, వరకు ట్రయల్న్ నిర్వహించేందుకు నిర్ణయించామని, గజ్వేల్ నుంచి కొత్తపల్లి వరకు 2019 డిసెంబర్ 31, వరకు రైలు నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగానే పనులు చకచకా కొనసాగుతున్నట్టు జనరల్ మేనేజర్ తమకు వివరించారని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు.

1998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles