అనాథలకు అండగా కరీంనగర్ పోలీసులు

Mon,April 16, 2018 07:06 PM

Karimnagar Police support orphans

కరీంనగర్: అనాథలు, వృద్ధులు, పేదలకు చేయూతనందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు. జిల్లాలోని చొప్పదండి సర్కిల్ పరిధిలో గల అభాగ్యులకు గంగాధర మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో 'పిడికెడు బియ్యం- పుట్టెడు అన్నం', 'పుస్తకాలకు పునర్జన్మ' కార్యక్రమం నిర్వహించారు.

సీఐ రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. సమాజంలో తోటివారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ దాతృత్వ లక్షణాలు అలవర్చుకుంటే పేదరికాన్ని నిర్మూలించవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దాతలనుంచి అపూర్వస్పందన లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గంగాధర మాతృసేవా అనాథాశ్రమం, రామడుగు మండలం దేశ్‌రాజ్‌పల్లి, కరీంనగర్ అనాథాశ్రమంతోపాటు 50 మంది పేదవారికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషా విశ్వనాథ్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

1440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS