డీపీఆర్‌లు సమర్పించినా గెజిట్ విడుదల చేయ‌ట్లేదు!

Tue,January 22, 2019 01:29 PM

Karimnagar MP  vinod  addressing the media at Telangana Bhavan

హైదరాబాద్: ఉమ్మడి పాలనలో జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జాతీయ రహదారులు సాధించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. 1,385 కి.మీ జాతీయ రహదారులుగా ప్రకటించారు. 3,155 కి.మీ మేర 25 రాష్ట్ర రహదారులను హైవేలుగా మారుస్తూ అంగీకరించారు.

తెలంగాణలో జాతీయ రహదారులు విస్తరించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పలుసార్లు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించినా కేంద్రం గెజిట్ విడుదల చేయడం లేదు. పనులు చేయకుండా కేంద్రం కుంటి సాకులు చెప్తుందని విమర్శించారు.

1927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles