కాంతారావు బయోపిక్ ఆడియో విడుదల

Sun,July 15, 2018 06:27 PM

Kantharao biopic audio released

కోదాడ: జానపద సీనీ హీరో కత్తి కాంతారావు బయోపిక్ ఆధారంగా నిర్మిస్తున్న అనగానగా ఓ రాకుమారుడు చిత్ర ఆడియోను చిత్ర దర్శకులు ఆదిత్య ఇవాళ విడుదల చేశారు. కత్తి కాంతారావు సొంతూరైన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని ఆయన సొంత ఇంటి వద్ద ఆడియో రికార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ.. కాంతారావు సొంత గ్రామంలో ఆయన సన్నిహితులు, మిత్రుల సమక్షంలో ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఉందాన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వరప్రసాద్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles