కోమటిరెడ్డి ఓటమి.. కంచర్ల గెలుపు..

Tue,December 11, 2018 02:43 PM

Kancharla Bhupal Reddy wins from Nallagonda

హైదరాబాద్ : నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి చవిచూశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 20,504 ఓట్ల మెజార్టీతో కోమటిరెడ్డిపై గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గత ఎన్నికల్లో 60,774 ఓట్లు పోలవ్వగా, కంచర్ల భూపాల్ రెడ్డికి 50,227 ఓట్లు వచ్చాయి. అప్పుడు కోమటిరెడ్డి 10,547 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అయితే కంచర్ల గతంలో స్వతంత్ర అభ్యర్థిగా 50 వేల ఓట్లు సాధించి.. దానికి తోడు టీఆర్‌ఎస్ శ్రేణులు కలవడంతో భూపాల్ రెడ్డి గెలుపు ఖాయమైంది. మెడికల్ కాలేజీ సాధన, బత్తాయి మార్కెట్ వంటి అభివృద్ధి పనులు అనుకూలతలుగా కంచర్లకు మారాయి. గత 20 ఏండ్లుగా కోమటిరెడ్డివి కోతలు తప్ప చేతలు లేవనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి.

6023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles