టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు

Tue,September 4, 2018 05:15 PM

kamareddy congress leaders joined trs Today

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు నర్సింగరావు, మాచారెడ్డి మామిండ్ల అంజయ్యతోపాటు ఇతర నేతలు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గంప గోవర్దన్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

3914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS