కళ్యాణలక్ష్మి మంచి పథకం: బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్

Sat,March 12, 2016 04:06 PM

kalyana lakshmi scheme is good scheme bjp mla lakshman

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు చెందిన పెళ్లీడు యువతుల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష బీజేపీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని ప్రశంసించారు. కళ్యాణలక్ష్మి పథకం మంచి పథకమని కొనియాడారు. ఈ పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పేదల కోసం మరిన్ని ఇలాంటి సంక్షేమ పథకాలు రావాలని కోరుకుంటున్నానన్నారు.

అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పథకం బాగుందని పేర్కొన్నారు. అయితే సన్న బియ్యం పథకం దారి మళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

1823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles