16 ఎంపీలను గెలిపిస్తే..సీఎం కేసీఆర్‌ వాటిని 116 చేస్తారు!

Sun,March 24, 2019 02:25 PM

Kalvakuntla Kavitha Election Campaign in Nizamabad

నిజామాబాద్‌: నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం సిరికొండలో ఎంపీ కవిత రోడ్‌షో నిర్వహించారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లు సీఎం కేసీఆర్‌కు ఎంతో తృప్తినిచ్చే అంశమని కవిత అన్నారు. రోడ్‌షోలో మాట్లాడుతూ.. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ సమస్యను పరిష్కరించాం. మే 1 నుంచి బీడీ కార్మికులకు రూ.2,016 జీవనభృతి ఇస్తాం. పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ప్రభుత్వం మనది. ఈ ఐదేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం. గిరిజనుల పోడు భూముల సమస్య తొందరలోనే పరిష్కారమవుతది. గిరిజనులందరికి త్వరలోనే పాస్‌బుక్‌లు అందుతాయి. సొంత స్థలంలో ఇండ్లు కట్టుకోవాలనుకునేవారికి రూ.5లక్షల ఇస్తాం. మీరు 16 ఎంపీలను గెలిపిస్తే.. సీఎం కేసీఆర్‌ వాటిని 116 చేస్తారు. పాతాళం నుంచి ఆకాశం వరకు కాంగ్రెస్‌వి అన్నీ కుంభకోణాలే. బీజేపీవన్నీ మతతత్వ రాజకీయాలే. అసత్యాలు ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట. గుజరాత్‌లో ఇచ్చే వృద్ధాప్య పెన్షన్‌ రూ.750 మాత్రమే. ఐదేళ్ల నుంచి పెన్షన్‌ ఇస్తున్నాం.. ఎన్నికల ముందు కాదు. అని కవిత పేర్కొన్నారు. ఈ రోడ్‌షోలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ కవితకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు.

1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles