ఖండాంతరల్లో సైతం కాళోజి గారి స్మరణం

Mon,September 10, 2018 02:50 PM

kaloji narayana rao jayanthi celebrations at UK

ప్రజా కవి కి కాళోజి నారాయణ రావు గారి జయంతి తెలంగాణ భాష దినోత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు యునైటెడ్ కింగ్డన్ తెలంగాణ జాగృతి శాఖ , అధ్యక్షుడు సుమన్ రావు బలమూరి పిలుపు మేరకు యూకే తెలంగాణ జాగృతి శ్రేణులు , కార్యవర్గ సభ్యులు సకుటుంబ సమేతంగా విచ్చేసి కాళోజి గారి జయంతి ని జరుపుకున్నారు , తెలంగాణ యాస, భాష ఉనికి కై పోరాడిన కాళోజి గారి కృషి చిరస్మరణీయం , అందుకే తమ ముందు తరాల వారికి తెలంగాణ ఆణిముత్యం కాళోజి గొప్పతనాన్ని వివరించామని వక్తలు చెప్పారు.

జాగృతి యూకే ఉపాధ్యక్షులు పావని గణేష్ , శ్రవణ్ కుమార్ , వంశీ తులసి ముఖ్య కార్యదర్శి సంతోష్ ఆకుల తో పాటు జాగృతి యూకే ముఖ్య కార్యవర్గ సభ్యులు తో పాటు పలువురు తెలంగాణ ప్రవాసులు ఈ కార్యక్రమానికి వచ్చారు , అదే విధంగా అక్టోబర్ లో భారీ ఎత్తున బతుకమ్మ పండుగను యూకే లో ని పలు ప్రాంతాలలో పాటు లండన్ లో ఘనంగా జరుపుతున్నామని దానికి సంబంధించిన వివరాలు , ప్రణాళిక టీం తో కలిసి చర్చలు జరిపామని అధ్యక్షుడు సుమన్ రావు బలమూరి ఈ సందర్బంగా తెలిపారు.

905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles