ఈ నెల 9న కాళోజీ 103వ జయంతి

Mon,September 4, 2017 07:49 AM

Kaloji Narayana Rao 103th birthday on 9th september

హైదరాబాద్ : ఈ నెల 9న కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ 103వ జయంతిని రాష్ట్ర మంతటా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రవీంద్రభారతిలో అధికారికంగా ఉత్సవాలను జరుపనున్నారు. ఇందులోభాగంగా తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన ఉత్తమ రచయితకు కాళోజీ అవార్డును ఇచ్చి సత్కరించనున్నారు.

అవార్డులను ఇచ్చే సంప్రదాయాన్ని 2015 నుంచి ప్రారంభించారు. అవార్డు గ్రహీతను ఒక లక్షా వేయి నూటపదహార్ల పారితోషికం, కాళోజీ జ్ఞాపిక, శాలువాతో సన్మానిస్తారు. 2015లో ఈ అవార్డు ప్రముఖకవి అమ్మంగి వేణుగోపాల్‌ను వరించింది. 2016లో పాటల రచయిత, కళాకారుడు గోరటి వెంకన్న ఈ అవార్డును అందుకున్నారు. 2017కు గాను అవార్డు గ్రహీతను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి సారథ్యంలో ఓ కమిటీని నియమించింది. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు విద్యాశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో విజేతలను ఎంపికచేసి బహుమతులు అందజేస్తారు. అదేవిధంగా వరంగల్‌లో కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. కాళోజీ కుటుంబ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.10 లక్షలు కేటాయించారు. కాళోజీ ఫౌండేషన్ చైర్మన్ నాగిళ్ల రామశాస్త్రి నాయకత్వంలోని కమిటీ కాళోజీ కుటుంబ సంక్షేమ బాధ్యతలను నిర్వహిస్తున్నది.

2603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles