కాళోజీ వర్సిటీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Sat,May 4, 2019 02:39 PM

kaloji health university released notification to the PG MEDICAL and DENTAL admissions

హైదరాబాద్: మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసింది. పీజీ, దంత వైద్య సీట్ల భర్తీకి వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ నెల 7న ఆన్‌లైన్ కౌన్సిలింగ్ నిర్వహణ జరగనున్నట్లు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలోని రామ్‌రెడ్డి దూరవిద్యా కేంద్రంలో కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మేనేజ్‌మెంట్ సీట్లకు దరఖాస్తు చేసుకుని మెరిట్ జాబితాలో పేరు ఉన్నవారు కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. అర్హులైన అభ్యర్థులంతా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. తొలి విడతలో సీట్లు పొంది కళాశాలల్లో చేరని వారు రెండో విడతకు అనర్హులు అన్నారు. పూర్తి సమాచారం కోరకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.in కు లాగినై తెలుసుకోవచ్చన్నారు.

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles