వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం పూర్తి : హరీష్

Sat,June 10, 2017 12:57 PM

Kaleshwaram will complete next June, says Harish Rao

వరంగల్ రూరల్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్ పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేటలో విస్తృతంగా పర్యటించి ఎస్సారెస్పీ కాలువల స్థితిగతులపై సమగ్ర పరిశీలన జరిపారు. రాయపర్తిలో హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథా అవుతున్నాయని తెలిపారు. వృథా జలాలను బీడు భూములకు మళ్లించే మహాయజ్ఞం కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం వరంగల్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తొలిసారి థిక్ పాలిథిన్ కవర్‌ను కాలువపై కప్పి నీరు వృథా కాకుండా నూతన ప్రయోగం చేయనున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ 1, 2వ దశ కాలువలను పరిశీలించాం.. కాలువలకు అవసరమైన రిపేర్లు, అప్‌గ్రేడ్‌లకు వెంటనే అనుమతిలిస్తామని చెప్పారు. వర్ధన్నపేట మండలంలో ఆకేరువాగు వద్ద రూ. 8 కోట్లతో మిషన్ కాకతీయ-4 కింద చెక్‌డ్యాం నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే మే నుంచి ప్రతీ ఎకరాకు రూ. 4 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్నామని తెలిపారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు మంత్రి.

1296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles