రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

Wed,September 12, 2018 08:18 PM

kadiyam srihari vinayaka chavithi wishes to telangana state people

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఈ వినాయక చవితి పండగ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే ఈ ప్రభుత్వానికి సంపూర్ణ విజయాలు అందిస్తుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరస్తుందని కోరుకున్నారు. సిఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న ప్రగతి పథకాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంగా, అత్యద్భుత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్రంగా తెలంగాణ పలు ప్రశంసలు, గుర్తింపులు పొందిందన్నారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంగా, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ సైతం  కొనియాడిన టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ ఎలాంటి విఘ్నాలు లేకుండా పాలన కొనసాగించేవిధంగా ఈ వినాయకచవితి శుభారంభం అవుతుందని అభిలశించారు. వినాయక చవితి రోజున విఘ్నేషుని పూజ చేసి నిలాపనిందనలను తొలగించుకోవడం ఆచారమని, అదేవిధంగా రాష్ట్రంలోని పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న నిందారోపణలకు తావు లేకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ ముందస్తుకు తీసుకున్న నిర్ణయం విజయవంతమై ఫలించే విధంగా ఈ చవితి పండగ రోజు విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు.

బుద్ధి, సిద్ధికి నాథుడైన గణపతి ఈ రాష్ట్రాన్ని అక్షర తెలంగాణగా, బంగారు తెలంగాణగా రూపొందించడంలో విఘ్నాలన్నింటిని తొలగించాలని ప్రార్థించారు. ఈ గొప్ప లక్ష్యంలో ప్రజలందరికీ శుభం జరగాలని, కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆయురారోగ్యాలతో, అష్టశ్వైర్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. మరోసారి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

4259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles