వరంగల్ ప్రజల తీర్పు చారిత్రాత్మకం : కడియం

Tue,December 11, 2018 12:51 PM

Kadiyam Srihari says thanks to Warangal People

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ గాలి వీస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు ఇక్కడకు వస్తే తెలంగాణకు నష్టమని గ్రహించి.. బాబును మోసుకొచ్చిన కాంగ్రెస్ నేతలకు సరైన బుద్ధి చెప్పి వరంగల్ ప్రజలు చారిత్రాత్మక తీర్పును ఇచ్చారని కడియం చెప్పారు. ఇవాళ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఇచ్చిన తీర్పుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నూటికి నూరుపాళ్లు నిలబెట్టే విధంగా కష్టపడి పని చేస్తామని కడియం స్పష్టం చేశారు. వరంగల్‌ను హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, సహకారంతో సమిష్టిగా పని చేస్తామని తెలిపారు కడియం. జిల్లాలోని గుండాలను, భూకబ్జాదారులను ఓడించాలని ఇచ్చిన పిలుపును అందుకొని తమ వెంట కొండంత అండగా నిలిచిన వరంగల్ ప్రజానీకానికి కడియం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

3787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles