తెలంగాణ యూనివర్శిటీలు పటిష్టం : కడియం

Mon,February 5, 2018 07:22 PM

kadiyam srihari says about Universities in Telangana


హైదరాబాద్ : రాష్ట్రప్రభుత్వం తెలంగాణలోని యూనివర్సిటీలను పటిష్టం చేస్తోందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారన్నారు. తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి బిల్డింగ్ గ్రాంట్ కింద 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ రోజు పరిపాలన భవనం కోసం 3.4 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడంలో విద్యాశాఖ పాత్ర ముఖ్యమైందని, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం వల్ల మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని కడియం స్పష్టం చేశారు.

గత మూడేళ్లగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నామని కడియం తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలను, ప్రైవేట్ విద్యాలయాలను నియంత్రిస్తున్నాం. ఉత్తీర్ణుల కంటే ఎక్కువగా కాలేజీలలో సీట్లు ఉండడాన్ని రెగ్యులేట్ చేశాం. గతంలో ఇబ్బడిముబ్బడిగా కాలేజీలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తగ్గాయి. తెలంగాణ వచ్చాక ఆన్ లైన్ అడ్మిషన్లు చేస్తున్నాం. ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చదివే విద్యార్థి 1 నుంచి 12 వరకు తెలుగు నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.దీని కార్యాచరణ కోసం తెలుగు విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ చైర్మన్ గా కమిటీ వేశాం. వారు ప్రతిపాదనలు ఇచ్చారు. వీటిని ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణలో చదివే ప్రతి విద్యార్థి తెలుగు చదవాలి, రాయాలి, మాట్లాడాలి. అందుకే తెలుగును సులభతరంగా మార్చే సిలబస్ రూపొందిస్తున్నామని కడియం వెల్లడించారు.

తెలుగు విశ్వవిద్యాలయం ఖ్యాతి ఇనుమడింపజేసే విధంగా యూనివర్శిటీ ప్రొగ్రామ్స్, కోర్సులుండాలి. 2018-19 అకాడమిక్ సంవత్సరం నుంచి అన్ని విద్యాలయాల్లో తప్పనిసరి తెలుగు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీమతి అలేఖ్య, అకాశవాణి డైరెక్టర్ ఉదయ్ కిరణ్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

1992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles