కేజీబీవీల స్కూల్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కడియం

Thu,December 7, 2017 03:19 PM

kadiyam srihari Attends kgbv School leaders conference in jntu


హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాలేజీలు అడ్మిషన్లు, కౌన్సిలింగ్ కు ముందు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన ఫీజులకు అంగీకరించి, కాలేజి మధ్యలో కోర్టుకు వెళ్ళి ఫీజులను పెంచడం సరికాదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. జేఎన్ టీయూలో నిర్వహించిన కేజీబీవీల స్కూల్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ఫీజుల పెంపకానికి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జీవో ఇవ్వాలని ఇంజినీరింగ్ కాలేజీలు ప్రభుత్వం వద్దకు వస్తే..తల్లిదండ్రులకు భారం కలిగించే ఈ ఫీజులపై జీవో ఇవ్వమని తిరస్కరించామన్నారు. కోర్టు ఇంజినీరింగ్ కాలేజీలకు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం వెకేట్ పిటిషన్ వేసినట్లు చెప్పారు

ఫీజు నియంత్రణ కమిటి ఈ రోజు సమావేశమై దీనిపై అప్పీల్ కు వెళ్లడం పై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని కడియం చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మధ్యలో ఫీజులు పెంచి తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకుండా..ఈ ఫీజుల పెంపు ను వచ్చే ఏడాది ఫీజుల నియంత్రణ కమిటీ ముందుకు తీసుకువచ్చి ఆమోదించుకోవాలని కడియం కోరారు.

1281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS